Asaduddin Owaisi: హైదరాబాద్ పోలింగ్ బూత్ లపైనే ఫోకస్ ఎందుకు?: అసదుద్దీన్ ఒవైసీ

  • బీజేపీ ప్రాబల్య ప్రాంతాల్లో నిఘా ఎక్కడని ప్రశ్న
  • తెలంగాణ మొత్తం దృష్టి పెట్టాలని ఈసీకి వినతి
  • ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించాలని డిమాండ్
Asaduddin Owaisi Asks Why Checking Only In Hyderabad Poling booths

తెలంగాణలో కేవలం హైదరాబాద్ లోని పోలింగ్ బూత్ ల పైనే ఎన్నికల సంఘం ఫోకస్ పెట్టిందని ఎంఐఎం చీఫ్ అసుద్దీన్ ఒవైసీ ఆరోపించారు. సిటీలోని 420 పోలింగ్ బూత్ లలోనే తనిఖీలు చేస్తూ హడావుడి చేస్తున్నారని విమర్శించారు. బీజేపీ ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లో నిఘా ఎక్కడని ఆయన ప్రశ్నించారు. కరీంనగర్, నిజామాబాద్, మల్కాజ్ గిరి, ఆదిలాబాద్‌, సికింద్రాబాద్‌, మహబూబ్‌నగర్‌ నియోజకవర్గాల్లోని పోలింగ్ బూత్ లపై నిఘా పెట్టాలని సూచించారు.

హైదరాబాద్ పై మాత్రమే స్పెషల్ ఫోకస్ ఎందుకని నిలదీస్తూ.. రాష్ట్రంలోని మిగతా ప్రాంతాలపైనా దృష్టి సారించాలని ఈసీకి విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఆదివారం రాత్రి పాతబస్తీలో ఒవైసీ మాట్లాడుతూ.. కేంద్ర ఎన్నికల సంఘం, పోలీసులు తెంగాణలోని అన్ని పోలింగ్‌ కేంద్రాలపై దృష్టి కేంద్రీకరించాలని కోరారు.

  • Loading...

More Telugu News